Share News

Karimnagar: ఇందిరమ్మ ఇళ్లను గడువులోగా పూర్తి చేయాలి

ABN , Publish Date - Jun 15 , 2026 | 11:58 PM

కరీంనగర్‌ టౌన్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ పరిధిలో మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు గడువులోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని

 Karimnagar:  ఇందిరమ్మ ఇళ్లను గడువులోగా పూర్తి చేయాలి

- మున్సిపల్‌ కమిషనర్‌ ప్రపుల్‌దేశాయ్‌

కరీంనగర్‌ టౌన్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ పరిధిలో మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు గడువులోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ ప్రపుల్‌దేశాయ్‌ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు పనులను ప్రారంభించని లబ్ధిదారుల వద్దకు వెళ్లి కారణాలను తెలుసుకోవాలని సూచించారు. ఎల్‌-1, ఎల్‌-2, ఎల్‌-3 కేటగిరీ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్‌ ఆయాజ్‌, డిప్యూటీ కమిషనర్‌ ఖాదర్‌ మొహియుద్దీన్‌ పాల్గొన్నారు.

- నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న నూతన భవనంపై అంతస్తు పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరగా పూర్తిచేయాలని కమిషనర్‌ ప్రపుల్‌దేశాయ్‌ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. సోమవారం ఆయన పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల పురోగతి, నాణ్యతను అడిగి తెలుసుకుని నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Updated Date - Jun 15 , 2026 | 11:58 PM