Karimnagar: హిందువులు ఐక్యంగా ఉండాలి
ABN , Publish Date - Apr 02 , 2026 | 11:46 PM
కరీంనగర్ కల్చరల్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): హిందువులంతా ఐక్యంగా ఉండాలని తెలంగాణ ధర్మాచార్య పీఠం సర్వేశ్వరాంబిక శివయోగి శివాచార్య స్వామి అన్నారు.
- తెలంగాణ ధర్మాచార్య పీఠం సర్వేశ్వరాంబిక శివయోగి శివాచార్య స్వామి
- భక్తి శ్రద్థల మధ్య వీరహనుమాన్ విజయయాత్ర
కరీంనగర్ కల్చరల్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): హిందువులంతా ఐక్యంగా ఉండాలని తెలంగాణ ధర్మాచార్య పీఠం సర్వేశ్వరాంబిక శివయోగి శివాచార్య స్వామి అన్నారు. హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా విశ్వహిందూపరిషత్, భజరంగదళ్ ఆధ్వర్యంలో వీరహనుమాన్ విజయయాత్ర పేరుతో భారీ బైక్ ర్యాలీని గురువారం నిర్వహించారు. గాంధీరోడ్ రామాలయం వద్ద ర్యాలీ ప్రారంభంలో స్వామీజీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హిందూ ధర్మం కోసం ఏకీకృతం కావాలని అన్నారు. కుటుంబ, సామాజిక ధర్మాన్ని హిందువులు పాటిస్తారని, మన దేశం, సంస్కృతీ సాంప్రదాయలకోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ కరినగరమని, ఒకప్పుడు ఏనుగులతో విలసిల్లేదని, ఏనుగు అంటే వినాయకుడు ఆయన జ్ఞానానికి ప్రతీక అని తెలిపారు. కాషాయ ధ్వజం రెపరెపలాడే చోట ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని అన్నారు. యాత్ర టవర్‌సర్కిల్, ప్రకాశం గంజ్, రూరల్ పోలీస్ స్టేషన్, కమాన్, వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్, బస్టాండ్, తెలంగాణచౌక్, ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్, కోర్ట్, మంచిర్యాల, గాంధీరోడ్ చౌరస్తాల మీదుగా ర్యాలీ తిరిగి గాంధీరోడ్ రామాలయం వద్దకు చేరుకుంది. కార్యక్రమంలో వీహెచ్‌పీ జిల్లా అఽధ్యక్ష, కార్యదర్శులు ఇనుగంటి మధుసూదన్‌రావు, ఆదిమూలం విద్యాసాగర్, భజరంగదళ్ జిల్లా జోనల్ కన్వీనర్ తోట ప్రదీప్‌కుమార్, జిల్లా కన్వీనర్ కన్నం శంకర్, తోట రాజేందర్, గుజ్జేటి రాజేందర్, మహేశ్, వంశీ, అఖిల్, శివసాయి, గౌతమ్, శివ, అశోక్, శ్రీనివాస్, సంతోష్, రంజిత్, నందకిషోర్ పాల్గొన్నారు.
ఫ భారీ బందోబస్తు....
పోలీసులు యాత్ర సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని విభాగాల పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. సమస్యాత్మక ప్రాంతాలు, పలు కూడళ్లలో పెద్ద సంఖ్యలో పోలీసులు పాల్గొని పర్యవేక్షించారు. ర్యాలీ జరుగుతున్న దారి పొడవునా పోలీసులు అనుసరిస్తూ బందోబస్తును చేపట్టారు. సీపీ సూచనలు, ముందు జాగ్రత్త చర్యలు, పోలీసుల బందోబస్తుతో యాత్ర ఆసాంతం ప్రశాంతంగా కొనసాగింది.