Share News

Karimnagar: ప్రత్యామ్నాయ పంటలతో అధిక ఆదాయం

ABN , Publish Date - Sep 18 , 2026 | 12:35 AM

గంగాధర, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతుల అధిక ఆదాయం పొందవచ్చని జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త వేణుగోపాల్‌ అన్నారు.

Karimnagar:  ప్రత్యామ్నాయ పంటలతో అధిక ఆదాయం

గంగాధర, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతుల అధిక ఆదాయం పొందవచ్చని జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త వేణుగోపాల్‌ అన్నారు. గురువారం గంగాధర రైతు వేదికలో ఉద్యాన వనశాఖ ఆధ్వర్యంలో రైతులకు పంట మార్పిడి, కూరగాయల సాగు, ఆయిల్‌ ఫాం పంటలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆకర్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ రైతులు మునగ, బొప్పాయ వంట తోటలను సాగు చేస్తే తక్కువ సమయంలో అధిక ఆదాయాన్ని పొందవచ్చన్నారు. బంతి, గులాబీ, లిల్లీ వంట పూలకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉందని కనీసం పది గుంటల విస్తీర్ణంలో సాగు చేయాలని సూచించారు. ఏడీఏ ప్రియదర్శిని మాట్లాడుతూ వరికి ప్రత్యామ్నాయంగా ఇతర ఉద్యాన పంటలను సాగు చేయాలని, ఆయిల్‌ ఫాంతో అధిక ఆదాయం లభిస్తుందన్నారు. ఉద్యావన వనశాఖ అధికారి స్వాతి మాట్లాడుతూ వరికి ప్రత్యామ్నాయంగా పండ్ల తోటలు, ఆయిల్‌ పామ్‌ పంటలు సాగు చేయాలని వాటిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తుందన్నారు. 90శాతం సబ్సిడీపై డ్రిప్‌, స్ర్పింక్టర్లు అందుబాటులో ఉన్నాయని ఆసక్తి గల రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏవో శ్రీనివాస్‌, ఏఈవోలు, హెచ్‌ఈవోలు, ఆత్మ బీటీఎం, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Sep 18 , 2026 | 12:35 AM