Karimnagar: తీరిన కష్టాలు
ABN , Publish Date - Sep 03 , 2026 | 11:42 PM
కరీంనగర్ రూరల్, సెప్టెంబరు 3 (ఆంద్రజ్యోతి): కరీంనగర్ శివారు తీగలగుట్టపల్లి రైల్వే స్టేషన్ వద్ద గుంతల రోడ్డుతోఇబ్బందులు పడ్డ వాహనదారుల కష్టాలు తీరాయి.
- ఆర్వోబీ వద్ద రూ. 33 లక్షలతో తారు రోడ్డు నిర్మాణం
కరీంనగర్ రూరల్, సెప్టెంబరు 3 (ఆంద్రజ్యోతి): కరీంనగర్ శివారు తీగలగుట్టపల్లి రైల్వే స్టేషన్ వద్ద గుంతల రోడ్డుతోఇబ్బందులు పడ్డ వాహనదారుల కష్టాలు తీరాయి. బీటి రోడ్డు నిర్మాణంతో ఆర్వోబీ వద్ద ప్రయాణికులు సాఫీగా ప్రయాణం చేస్తున్నారు. రైల్వే స్టేషన్ సమీపంలో నిర్మిస్తున్న ఆర్వోబీ వద్ద రోడ్డు దెబ్బతిని అధ్వానంగా మారింది. దీంతో వర్షం పడితే గుంతల్లో ప్రయాణం, ఎండ కొడితే దుమ్ముదూళితో ఇక్కట్లు పడ్డ ప్రయాణికుల కష్టాలు తీరాయి. మున్సిపల్ సాదారణ నిధులతో 33 లక్షలతో రోడ్డు నిర్మించారు. బీటి రోడ్డు పనులు పూర్తయ్యాయి. దీంతో రైల్వే స్టేషన్ వద్ద బీటి రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కావడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆర్వోబీ పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ను ప్రయాణికులు కోరుతున్నారు.