Karimnagar: బో ‘నమో’ గంగమ్మ తల్లీ..
ABN , Publish Date - Aug 17 , 2026 | 12:05 AM
కరీంనగర్ కల్చరల్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): శ్రావణమాసంలో భాగంగా పట్టణ గంగపుత్ర (బెస్త) సంఘం ఆధ్వర్యంలో లోయర్ మానేరు డ్యాంలో
కరీంనగర్ కల్చరల్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): శ్రావణమాసంలో భాగంగా పట్టణ గంగపుత్ర (బెస్త) సంఘం ఆధ్వర్యంలో లోయర్ మానేరు డ్యాంలో గంగమ్మ తల్లి బోనాల జాతర ఆదివారం వైభవంగా నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న గంగపుత్ర కులస్తులు, మహిళలు బోనాలతో తరలి వచ్చి అమ్మవారికి పసుపు కుంకుమలు, వస్త్రాలు, ఒడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బోయవాడలో ఊరేగింపులో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. డ్యాంలోని గంగమ్మ తల్లి ఆలయంలో మేయర్ కొలగాని శ్రీనివాస్ పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్ పెద్దపల్లి జితేందర్, నాయకులు నాగుల రాజారాం, పర్రె రాజేశం, పెద్దపల్లి నరేందర్, పెద్దపల్లి రవీందర్, మోసం అంజయ్య, గడప కోటేశ్, మర్రి మల్లేశం పాల్గొన్నారు.