Karimnagar: గణతంత్ర వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు
ABN , Publish Date - Jan 26 , 2026 | 01:58 AM
కరీంనగర్ టౌన్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో గణతంత్ర దినోత్సవానికి అధికారయంత్రాంగం ఘనంగా ఏర్పాట్లు చేసింది.
- ఉదయం 9 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరించనున్న కలెక్టర్
కరీంనగర్ టౌన్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో గణతంత్ర దినోత్సవానికి అధికారయంత్రాంగం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఉదయం 9 గంటలకు కలెక్టర్ పమేలా సత్పతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. 9.10 గంటల వరకు వందన స్వీకారంచేసి కలెక్టర్ జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులను సన్మానిస్తారు. 10 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. 10 గంటల నుంచి 10.30 గంటల వరకు వివిధ రంగాల్లో కృషిచేసిన వారికి ప్రశంసాపత్రాలు, మెమెంటోలను కలెక్టర్ అందజేస్తారు. అనంతరం కలెక్టర్ వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. ఆదివారం గ్రౌండ్‌ను శుభ్రం చేసి షామియానాలను, వీఐపీల కోసం గ్యాలరీని ఏర్పాటు చేశారు. పోలీసు బందోబస్తుతోపాటు భారీ ఏర్పాట్లు చేశారు.