Share News

Karimnagar: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

ABN , Publish Date - May 05 , 2026 | 12:02 AM

కరీంనగర్‌, మే 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.

 Karimnagar: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

- కలెక్టర్‌ చిత్రా మిశ్రా

కరీంనగర్‌, మే 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే కేటాయించిన రైస్‌ మిల్లులకు తరలించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంఝట రైసుమిల్లులకు ధాన్యాన్ని తరలించడంలో రవాణా సమస్య తలెత్తకుండా చూసుకోవాలన్నారు. ధాన్యం విక్రయించిన రైతుల వివరాలను ఆలస్యం చేయకుండా వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. సీఎంఆర్‌ పెండింగ్‌లో ఉండకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు ఆయా కొనుగోలు కేంద్రాల ద్వారా తెలియజేయాలన్నారు. రైసుమిల్లుల వద్ద ధాన్యం ఆన్‌లోడింగ్‌కు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. సమావేశంలో ఆర్డీవో మహేశ్వర్‌, డీఎస్‌వో నర్సింగారాడు, డీఎం సివిల్‌ సప్లయి స్‌ రజనీకాంత్‌, డీఆర్డీవో శ్రీధర్‌, డీసీవో రామానుజాచారి పాల్గొన్నారు.

- ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యమివ్వాలి..

సుభాష్‌నగర్‌: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు ప్రాధాన్యమిచ్చి పరిష్కరించాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్‌ దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 188 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. వచ్చిన దరఖాస్తుల్లో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించగా మరి కొన్ని సంబందిత అధికారులకు బదిలీ చేశారు. దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అశ్విని తానాజీ వాఖడే, ఆర్‌డీవో మహేశ్వర్‌, జడ్పీ సీఈవో శ్రీనివాస్‌, ఏవో సుధాకర్‌ పాల్గొన్నారు.

- ఇక డివిజన్‌ స్థాయి ప్రజావాణి..

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి సోమవారం డివిజన్‌ స్థాయి ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ చిత్రమిశ్రా తెలిపారు. జిల్లాలోని కరీంనగర్‌, హుజురాబాద్‌ రెవెన్యూ డివిజన్ల పరిధిలో ప్రజావాణి కార్యక్రమాన్ని సమర్దవంతగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక నుంచి జిల్లా స్థాయి ప్రజావాణితోపాటు రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో ఆర్‌డీవో కార్యాలయాలలో కూడా ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ప్రజల ఫిర్యాదులపై తీసుకున్న చర్యల నివేదికలను పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. ప్రజలు తమ ఫిర్యాదుల స్థితిని ఆన్‌లైన్‌ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Updated Date - May 05 , 2026 | 12:02 AM