Share News

Karimnagar: ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం

ABN , Publish Date - Apr 21 , 2026 | 12:24 AM

కరీంనగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 20 (ఆంద్రజ్యోతి): ప్రభుత్వం దాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కసిరెడ్డి సురేందర్‌రెడ్డి అన్నారు.

 Karimnagar: ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం

- సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కసిరెడ్డి సురేందర్‌రెడ్డి

కరీంనగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 20 (ఆంద్రజ్యోతి): ప్రభుత్వం దాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కసిరెడ్డి సురేందర్‌రెడ్డి అన్నారు. కరీంనగర్‌ రూరల్‌ మండలం చామనపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ఆయన రైతులతో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో వరి కోసి వారం రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు ప్రారంభించలేదన్నారు. పెరిగిన ఉష్ణోగ్రతలతో ధాన్యం రంగు మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అకాల వర్షాలు కురిస్తే రైతులు నష్టపోతారని, ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సీపీఐ మండల నాయకుడు మెరుగు కొమురయ్య, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Apr 21 , 2026 | 12:24 AM