Karimnagar: ప్రజల వద్దకు పాలన
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:13 AM
కరీంనగర్ టౌన్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రజల వద్దకు పాలన తీసుకు వస్తున్నామని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు.
- వార్డుసభలో కలెక్టర్ చిత్రా మిశ్రా
కరీంనగర్ టౌన్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రజల వద్దకు పాలన తీసుకు వస్తున్నామని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికు 99 రోజల కార్యచరణలో భాగంగా నగరపాలక సంస్థ ఆద్వర్యంలో వార్డు సభలు గురువారం ప్రారంభించారు. 10వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ప్రతేక వార్డు సభలు జరగనున్నాయి. మొదటి రోజు నగరంలోని 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 46, 47, 48 డివిజన్లకు సంబంధించిన వార్డు సభను రేకుర్తిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ డివిజన్ల వారీగా ప్రజా సమస్యలను ప్రాధాన్య క్రమంలో గుర్తించి వార్డుల సభల్లో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. నగరాన్ని స్వచ్ఛంగా మార్చడంలో నగరవాసులది కీలక పాత్ర అన్నారు. డివిజన్లలో ఆరోగ్య కేంద్రాలు, హెల్త్ సెంటర్లను వినియోగించుకోవాలని సూచించారు. కమిషనర్ ప్రపుల్‌దేశాయ్ మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే సమస్యలపై ముందస్తు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. నగరంలోని డంపుయార్డు ప్రక్షాళను అర్బన్ చాలెంజ్ ఫండ్ స్కీంలో 80 కోట్లు కేటాయించామన్నారు. ఇందిరమ్మ రెండో విడతో రెండు వేల ఇళ్లు నిర్మించేందుకు ప్రణాళిక రూపొదించామన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు పునాది లెవల్‌లో ఆగిపోయిన 500 గృహాలను పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. ప్రతీ ఒక్కరు జన గణన ప్రక్రియలో వివరాలను నమోదు చేస్కోవాలని సూచించారు. అనంతరం హరితోత్సవంలో భాగంగా కమిషనర్ ప్రపుల్‌దేశాయ్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు రేకుర్తి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో కార్పొరేటర్లతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సుధగోని మాధవి, పర్వతం మల్లేషం, గంట శ్రీనివాస్, వాసాల రమేష్, వరాల నర్సింగం, ఒంటెల సత్యనారాయణ, కాంతాల జగన్ రెడ్డి, అదనపు కమిషనర్ ఆయాజ్, సువార్త, డిప్యూటీ కమిుషనర్లు ఖాధర్ మొహియుద్దీన్, వేణు పాల్గొన్నారు.