Share News

Karimnagar : ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే పైచేయి

ABN , Publish Date - Apr 13 , 2026 | 01:31 AM

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌) ఇంటర్మీడియేట్‌ పబ్లిక్‌ పరీక్షా ఫలితాల్లో ఈయేడూ బాలికలదే హవా కొనసాగింది. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ జనరల్‌ విభాగాల్లోనే కాకుండా వొకేషనల్‌ కోర్సుల్లోనూ బాలికలు బాలురికంటే ఎక్కువ ఉత్తీర్ణత శాతం సాధించారు.

Karimnagar :  ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే పైచేయి

- మొదటి సంవత్సరంలో 70.17 శాతం..

- ద్వీతీయ సంవత్సరంలో 80.04 శాతం ఉత్తీర్ణత

- సెకండ్‌ ఇయర్‌లో మళ్లీ ఏడవ ర్యాంకు

- ప్రైవేట్‌లో మెరుగైన ఫలితాలు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ఇంటర్మీడియేట్‌ పబ్లిక్‌ పరీక్షా ఫలితాల్లో ఈయేడూ బాలికలదే హవా కొనసాగింది. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ జనరల్‌ విభాగాల్లోనే కాకుండా వొకేషనల్‌ కోర్సుల్లోనూ బాలికలు బాలురికంటే ఎక్కువ ఉత్తీర్ణత శాతం సాధించారు. 2024-25 విద్యాసంవత్సరంలో రాష్ట్రస్థాయిలో ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌లో జిల్లా ఉత్తీర్ణతశాతంలో ఏడో స్థానం నిలువగా ఈయేడూ ఏడో స్థానానికే పరిమితమైంది. ఫస్ట్‌ ఇయర్‌లో ఈయేడు ఆరో స్థానంలో నిలిచింది. 2025-26 విద్యాసంవత్సరంలో జిల్లాలో నిర్వహించిన ఇంటర్‌ రెండో సంవత్సరం పరీక్షలకు 14,943 మంది విద్యార్థులు హాజరుకాగా అందులో 11,961 మంది ఉత్తీర్ణులయ్యారు. 80.04 ఉత్తీర్ణతా శాతం సాధించారు. మొదటి సంవత్సరంలో 16.726 మంది విద్యార్థులు పరీక్షలకు రాయగా 11,737 మంది ఉత్తీర్ణులయ్యారు. 70.17 శాతం ఉత్తీర్ణత సాధించారు. వొకేషనల్‌ పరీక్షల్లోనూ ఆశించిన మేరకు ఫలితాలు సాధించలేదు. ఇంటర్‌ మొదటి సంవత్సరం 1,449 మంది విద్యార్థులు వొకేషనల్‌ పరీక్షలు రాయగా 822 మంది ఉత్తీర్ణత సాధించడంతో రాష్ట్రంలో 24వ స్థానంలో నిలిచింది.. రెండో సంవత్సరంలో 1,320 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 876 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ పరీక్షల్లో జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 30వ స్థానం దక్కింది. ఇంటర్‌ రెండో సంవత్సరంలో ఉత్తీర్ణులయిన 11,961 మందిలో 6347 మంది బాలికలు, 5614 మంది బాలురు ఉన్నారు. మొదటి సంవత్సరం 11.737 మంది ఉత్తీర్ణులు కాగా, వారిలో 6051 మంది బాలికలు, 5686 మంది బాలురు ఉన్నారు. రెండు సంవత్సరాల ఫలితాల్లోనూ బాలికలే పై చేయి సాధించారు. ఈయేడు కూడా ప్రభుత్వ కళాశాలల ఉత్తీర్ణతను పోల్చిచూస్తే ప్రైవేట్‌ కళాశాలల్లోనే ఉత్తీర్ణతశాతంతోపాటు అత్యఽధిక మార్కులతో స్టేట్‌ ర్యాంకులు ప్రైవేట్‌ కళాశాలలకే సొంతమయ్యాయి.

ఫ పెరిగిన ఉత్తీర్ణతశాతం :

గత సంవత్సరం ఫలితాలతో పోలిస్తే ఈయేడు ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌లో ఉత్తీర్ణత శాతం పెరిగినా ఇతర జిల్లాల్లోనూ ఫలితాలు మెరుగవడంతో జిల్లా ఫస్ట్‌ ఇయర్‌లో ఆరో స్థానం, సెకండ్‌ ఇయర్‌లో ఏడోస్థానానికే పరిమితమైంది. ఫస్ట్‌ ఇయర్‌లో గత ఏడాది 69.84శాతం ఉత్తీర్ణత సాధించగా ఈయేడు 70.17కు పెరిగింది. సెకండ్‌ ఇయర్‌లో గత ఏడాది 73.81శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా ఈయేడు దాదాపు ఏడు శాతం ఉత్తీర్ణత పెరిగి 80.04శాతానికి చేరింది.

ఫ తొమ్మిది సంవత్సరాల ఉత్తీర్ణతశాతం

===============================

సంవత్సరం మొదటి సంవత్సరం రెండో సంవత్సరం

(శాతం) (శాతం)

2025-26 70.17 80.04

2024-25 69.84 73.81

2023-24 63.41 74.39

2022-23 69 70

2021-22 69 72

2020-21 (కొవిడ్‌) 100 100

2019-20 (కొవిడ్‌) 100 100

2018-19 67 71

2017-18 66 71

-----------------------------------------------------------------

Updated Date - Apr 13 , 2026 | 01:31 AM