Share News

Karimnagar: బాలికల చదువు దేశ భవిష్యత్తుకు పునాది

ABN , Publish Date - May 26 , 2026 | 11:29 PM

మానకొండూర్‌, మే 26 (ఆంధ్రజ్యోతి) : బాలికల చదువు దేశ భవిష్యత్తుకు పునాది అని జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి అన్నారు.

Karimnagar:   బాలికల చదువు దేశ భవిష్యత్తుకు పునాది

- జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి

మానకొండూర్‌, మే 26 (ఆంధ్రజ్యోతి) : బాలికల చదువు దేశ భవిష్యత్తుకు పునాది అని జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి అన్నారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో అన్నారం గ్రామపంచాయతీ కార్యాలయంలో మహిళా వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ బాల్య వివాహాలు చేయకుండా ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలన్నారు. బాల్య వివాహాల వల్ల వారి ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా చదువు మధ్యలోనే ఆగిపోయి జీవితం అంధకారంలోకి వెళ్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాలికల విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ప్రతి తల్లిదండ్రులు కుమారునితో కుమార్తెను సమానంగా పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ బొట్ల స్వరూప, టిడిపివో శ్రీలత, సూపర్‌వైజర్‌ రమాదేవి, జిల్లా కో-ఆర్డినేటర్‌ సంపత్‌, కవిత, సంగీత, అంగన్‌వాడీ కార్యకర్తలు, గ్రామ మహిళలు పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2026 | 11:29 PM