Share News

Karimnagar: ఘనంగా గరుడ వాహన సేవ

ABN , Publish Date - Apr 27 , 2026 | 11:28 PM

ఇల్లందకుంట, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో గరుడ వాహన సేవను సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు.

Karimnagar:  ఘనంగా గరుడ వాహన సేవ

ఇల్లందకుంట, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో గరుడ వాహన సేవను సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు శేషం వంశీధరచార్యులు ఆధ్వర్యంలో సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులను వివిధ రకాల పూలతో ఘనంగా అలంకరించి గరుడ వాహనంపై అధిరోహించారు. అనంతరం ఆలయ మాడ వీధుల్లో స్వామివారిని ఊరేగించారు. భక్తులు పెద్దఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2026 | 11:28 PM