Share News

Karimnagar: అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి

ABN , Publish Date - Jan 22 , 2026 | 12:06 AM

తిమ్మాపూర్‌, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): అధికారులు, శాస్త్రవేత్తలు సూచనలను పాటిస్తూ రైతులు వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి అన్నారు.

Karimnagar:   అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి

- జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి

తిమ్మాపూర్‌, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): అధికారులు, శాస్త్రవేత్తలు సూచనలను పాటిస్తూ రైతులు వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ ఎగుమతులు, ఎగుమతి అవకాశాలపై రైతులు, ఉత్పత్తిదారుల సంస్థలకు అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ఫార్మర్‌ రిజిస్ట్రీ తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు. కరీంనగర్‌, రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్‌ హరికృష్ణ, శాస్త్రవేత్త కె మదన్‌మోహన్‌రెడ్డి, మార్కెటింగ్‌ డెవలప్మెంట్‌ ఆఫీసర్‌ స్వామి హజరై రైతులకు అవగాహన కల్పించారు. వీరు మాట్లాడుతూ రైతు ఉత్పత్తిదారుల సంఘాలు పంట ఉత్పత్తి మాత్రమే కాకుండా మార్కెటింగ్‌ చేసుకుంటే అధిక లాభాలు పొందవచ్చని సూచించారు. రైతులు పండించిన తమ పంటను ప్రాసెసింగ్‌ చేసి ఇతర దేశాలకు పంపించేటట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధానం గురించి వివరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు సురేందర్‌ నాయక్‌, పున్నంచందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jan 22 , 2026 | 12:06 AM