Share News

Karimnagar: బాలగోపాల్‌ అడుగు జాడల్లో నడవాలి

ABN , Publish Date - Oct 12 , 2026 | 12:11 AM

హుజూరాబాద్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): బాలగోపాల్‌ అడుగు జాడల్లో ప్రతీ ఒక్కరు నడవాలని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య అన్నారు.

Karimnagar:  బాలగోపాల్‌ అడుగు జాడల్లో నడవాలి

హుజూరాబాద్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): బాలగోపాల్‌ అడుగు జాడల్లో ప్రతీ ఒక్కరు నడవాలని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య అన్నారు. హుజూరాబాద్‌లో మానవ హక్కుల వేదిక, దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బాలగోపాల్‌ వర్ధంతి సభను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ బాలగోపాల్‌ మూడున్నర దశాబ్దాలపాటు హక్కుల రంగంలో మేధావిగా, నాయకుడిగా అందించిన సేవలను గుర్తు చేశారు. ఎన్‌ఐఏ కోర్టు జీరం ఘాటీ నింధితులకు విధించిన ఉరిశిక్షలను వెంటనే రద్దు చేయాలన్నారు. మరణ శిక్షను రద్దు చేయాలన్నారు. దేశంలో కోట్లాది మంది సామాన్య ప్రజల ఓటు హక్కును రద్దు చేస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనరల్‌ జ్ఞానేశ్‌కుమార్‌ చేత ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయించాలన్నారు. కాక్రోచ్‌ జనతా పార్టీ, ఇతర నిరసనకారులపై కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్బంధాన్ని వెంటనే నిలిపివేయాలన్నారు. సమావేశంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకుడు ఎస్‌ జీవన్‌కుమార్‌, డాక్టర్‌ ఎస్‌ తిరుపతయ్య, తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకుడు ముక్కెర రాజు, ఆవునూరి సమ్మయ్య, రమ, బండ శ్రీనివాస్‌, వర్ధినేని రవీందర్‌రావు, జీడీ రవితేజ, జీడీ సారయ్య, వెంకట్రాజం, పల్కల ఈశ్వర్‌రెడ్డి, వేల్పుల రత్నం, రవీందర్‌, ప్రభాకర్‌, దయాల్‌సింగ్‌, రమేష్‌, తిరుపతి, మార్వాడి సుదర్శన్‌, భరత్‌, బాబ్జీ, రాములు పాల్గొన్నారు.

Updated Date - Oct 12 , 2026 | 12:11 AM