Share News

Karimnagar: సైదాపూర్‌ మండంలో అయిదు టీబీ రహిత గ్రామాలు

ABN , Publish Date - Mar 06 , 2026 | 12:28 AM

సైదాపూర్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): టీబీ ముక్త్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా మొదటి విడతగా మండలంలోని సర్వాయిపేట, పెర్కపల్లి, ఎలబోతారం, నల్లరామయ్యపల్లి, ఎల్లంపల్లి గ్రామాలను టీబీ రహిత గ్రామ పంచాయతీలుగా కేంద్ర కుటుంబ శాఖ ప్రకటించింది.

Karimnagar:   సైదాపూర్‌ మండంలో అయిదు టీబీ రహిత గ్రామాలు

- కేంద్ర కుటుంబ శాఖ ప్రకటన

సైదాపూర్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): టీబీ ముక్త్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా మొదటి విడతగా మండలంలోని సర్వాయిపేట, పెర్కపల్లి, ఎలబోతారం, నల్లరామయ్యపల్లి, ఎల్లంపల్లి గ్రామాలను టీబీ రహిత గ్రామ పంచాయతీలుగా కేంద్ర కుటుంబ శాఖ ప్రకటించింది. స్థానిక ఆరోగ్య కేంద్రంలో టీబీ రహిత గ్రామాలుగా తీర్చి దిద్దేందుకు కృషి చేసిన అయిదు గ్రామాల ఆశా వర్కర్లకు ప్రశంసాపత్రాలు గురువారం అందజేశారు. కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇన్‌చార్జి వైద్యాధికారి కృష్ణారావు, సెక్టార్‌ హెల్త్‌ సూపర్‌వైజర్‌ ఎస్‌ రమేష్‌, రాయికల్‌ హెచ్‌ డబ్ల్యూసీ డాక్టర్‌ అరుణ్‌, వైద్య సిబ్బంది మంగళంప్రద, గీతాంజలి పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2026 | 12:28 AM