Karimnagar: అగ్నిప్రతిష్ఠ.. ధ్వజారోహణం...
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:08 AM
కరీంనగర్ కల్చరల్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని మార్కెట్‌రోడ్ వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
- భక్తులతో పోటెత్తిన వెంకన్న ఆలయం
- నేడు ఎదుర్కోలు ఉత్సవం
- వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
కరీంనగర్ కల్చరల్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని మార్కెట్‌రోడ్ వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం సూర్యరశ్మితో అగ్ని పుట్టించి వైభవంగా అగ్నిప్రతిష్ఠ చేశారు. వివిధ హోమాలు, నిత్యపూర్ణాహుతి అనంతరం ధ్వజారోహణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలపై శ్రీవారు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ కనువిందు చేశారు. రథసప్తమి కావడంతో ఆలయం భక్తులతో పోటెత్తింది. మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో సారె సమర్పించారు. ఉదయం జరిగిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, డీసీసీ అర్బన్ ప్రెసిడెంట్ వైద్యుల అంజన్‌కుమార్, కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు, అర్బన్‌బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, నాయకులు ఆకారపు భాస్కర్‌రెడ్డి, వి నరేందర్‌రెడ్డి, కటకం వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్‌దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్, వంశపారంపర్య ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్, చకిలం గంగాధర్, ఈవో కందుల సుధాకర్ భక్తులు పాల్గొన్నారు.
ఫ నేటి కార్యక్రమాలు..
సోమవారం ఉదయం నిత్యహోమం, కల్పవృక్ష వాహన సేవ, పద్మశాలి సంఘం వారిచే సారె సమర్పణ ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి ప్రకాశంగంజ్ వరసిద్ధి వినాయకస్వామి ఆలయం నుంచి అశ్వ, గజ వాహన సేవలతో ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు.