Karimnagar: ఎరువులు సక్రమంగా అందించాలి..
ABN , Publish Date - Jun 19 , 2026 | 12:18 AM
కరీంనగర్ రూరల్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): వానాకాలం సాగుకు అవసరమైన ఎరువులను రైతులకు సక్రమంగా అందించాలని అదనపు కల్టెర్ అశ్విని తానాజీ వాఖడే అదికారులను ఆదేశించారు.
కరీంనగర్ రూరల్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): వానాకాలం సాగుకు అవసరమైన ఎరువులను రైతులకు సక్రమంగా అందించాలని అదనపు కల్టెర్ అశ్విని తానాజీ వాఖడే అదికారులను ఆదేశించారు. కరీంనగర్ రూరల్ మండలంలోని నగునూర్ ఎరువుల గోదామును గురువారం పరిశీలించారు. జిల్లాలో ఏయే ఎరువులు ఏ డీలర్లకు పంపిణీ చేశారనే వివరాలను అడిగి తెలసుకున్నారు. జిల్లాలోని విత్తన కేంద్రాలు, ఎరువుల విక్రయ కేంద్రాలు, ఇప్పటి వరకు జరిగిన అమ్మకాల వివరాలను పరిశీలించారు. జిల్లాలో ఉన్న ఎరువుల నిల్వలను పరిశీలించి మార్క్‌పెడ్ డీఎం, వ్యవసాయ అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సంచాలకలు కె రణధీర్‌రెడ్డి, మండల వ్యవసాయ అధికారి సత్యం పాల్గొన్నారు.