Karimnagar: హోరాహోరీగా ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ పోటీలు
ABN , Publish Date - Apr 05 , 2026 | 12:01 AM
కరీంనగర్ స్పోర్ట్స్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాస్థాయి ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ పోటీలు హోరాహోరీగా సాగాయి
కరీంనగర్ స్పోర్ట్స్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాస్థాయి ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ పోటీలు హోరాహోరీగా సాగాయి జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో శనివారం నిర్వహించిన ఈ పోటీలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 50 మంది క్రీడాకారులు హాజరయ్యారు. వీరికి రన్స్, త్రోస్, జంప్స్ అంశాల్లో పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులను ఈ నెల 11, 12 తేదీల్లో హన్మకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షడు నందెల్లి మహిపాల్, గెజిటెడ్ వ్యాయామ ఉపాధ్యాయులు బి రాజగోపాలాచారి, ఫిజికల్ డైరెక్టర్లు సత్తినేని రమేష్, తడిగొప్పుల రమేష్, హరికిషన్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.