Karimnagar: పట్టు పరిశ్రమ వైపు రైతులు దృష్టి సారించాలి
ABN , Publish Date - Aug 01 , 2026 | 11:43 PM
హుజూరాబాద్, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): రైతులు పట్టు పరిశ్రమ వైపు దృష్టి సారించాలని, శాస్త్రీయ పద్ధతులు అవలంభిస్తే పట్టు పురుగుల పెంపకంలో
- జిల్లా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే
హుజూరాబాద్, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): రైతులు పట్టు పరిశ్రమ వైపు దృష్టి సారించాలని, శాస్త్రీయ పద్ధతులు అవలంభిస్తే పట్టు పురుగుల పెంపకంలో అధిక లాభాలు పొందవచ్చని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. శనివారం హుజూరాబాద్ పట్టణంలోని రైతువేదికలో నా పట్టు- నా అభిమాన 2.0 జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానాన్ని పట్టు రైతులు నేర్చుకోవాలన్నారు. సెంట్రల్ సిల్క్ బోర్డు అభివృద్ధి చేసిన ఆధునిక పద్ధతులపై పట్టు రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. పట్టు పరిశ్రమ రైతులకు లాభదాయకమైందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టు రైతులకు అవసరమైన వనరులు, మౌలిక సదుపాయాలు అందిస్తుందన్నారు. జిల్లాలో పట్టు పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు అన్ని శాఖాధికారులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సెంట్రల్ సిల్క్ బోర్డు జిల్లా నోడల్ అధికారి డాక్టర్ గులాబ్ ఖాన్ రోహెలా, డాక్టర్ రాఘవేంద్ర, బానోత్ వెంకన్న, ఏడీఏ సునీత, ఏవో భూమిరెడ్డి, ప్రగతిశీల పట్టు రైతులు, చౌకీ పురుగుల పెంపకందారులు పాల్గొన్నారు.