Share News

రైతులు నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలి

ABN , Publish Date - May 02 , 2026 | 12:24 AM

రైతులు నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయాధికారిణి బాగ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం కొత్తపల్లి రైతు వేదికలో అవగాహన సదస్సులో మాట్లాడారు. రాబోయే వానాకాలం సీజన్‌ దృష్ట్యా రైతులు నాణ్యమైన ధ్రువీకరించిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలన్నారు.

రైతులు నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలి

భగత్‌నగర్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): రైతులు నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయాధికారిణి బాగ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం కొత్తపల్లి రైతు వేదికలో అవగాహన సదస్సులో మాట్లాడారు. రాబోయే వానాకాలం సీజన్‌ దృష్ట్యా రైతులు నాణ్యమైన ధ్రువీకరించిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. రైతులు లైసెన్స్‌ కలిగిన విత్తన విక్రయ కేంద్రాల్లో మాత్రమే విత్తనాలు కొనుగోలు చేసి బిల్‌ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పొలాస శాస్త్రవేత్త డాక్టర్‌ మధూకర్‌, సహాయ వ్యవసాయ సంచాలకులు కె రణధీర్‌రెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్‌ బి చత్రు నాయక్‌, మండల వ్యవసాయాధికారి కె సంతోష్‌కుమార్‌, ఏఈఓ రాము, డిసిఎస్‌ వలంటీర్స్‌ సిహెచ్‌ శ్రీనివాస్‌ రైతులు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2026 | 08:33 AM