Karimnagar: రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి
ABN , Publish Date - Jun 08 , 2026 | 11:05 PM
భగత్‌నగర్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వర్ణ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.
భగత్‌నగర్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వర్ణ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. నగరంలోని ముకుందలాల్ మిశ్రా భవన్‌లో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎకరానికి సంవత్సరానికి 15 వేలు ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ హామీ నెరవేర్చడంలో విఫలమైందన్నారు. రెండు పంటలకు రైతు భరోసా నిధులు ఎగ్గొట్టారన్నారు. వానాకాలం సీజన్ ప్రారంభమైనా పెట్టుబడి సాయం అందక రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. గ్రామ గ్రామాన కమిటీలు వేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలపై ఐక్య సమరశీల పోరాటాలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, జిల్లా కోశాధికారి బాసిర సంపత్‌రావు, సహాయ కార్యదర్శులు చెల్పూరి రాములు, శీలం అశోక్, జనూతుల జనార్దన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు గుండేటి వాసుదేవ్, కమిటీ సభ్యులు స్వప్న, తిరుపతి పాల్గొన్నారు.