Karimnagar: యూరియా సరిపోవడం లేదని రైతుల ఆందోళన
ABN , Publish Date - Jan 02 , 2026 | 11:52 PM
కరీంనగర్ రూరల్, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ రూరల్ మండలంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
కరీంనగర్ రూరల్, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ రూరల్ మండలంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులుగా ఆయా సంఘాలకు వచ్చిన యూరియా ప్రతిరోజు పంపిణీ చేస్తున్నప్పటికి సరిపోకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు ఆదార్ కార్డు, పట్టా దారు పుస్తకం ఆదారంగా ఓటీపీ చెబితేనే ఎకరానికి ఒక బస్తా అందజేస్తున్నారు. ఈ యూరియా సరిపోవడం లేదని, ఎకరానికి మూడు బస్తాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ రూరల్ మండలంలోని కరీంనగర్, దుర్శేడ్ వ్యవసాయ సషహకార సంఘాలకు కరీంనగర్ వ్యవసాయ సహకార సంఘానికి 20.25, దుర్శేడ్ సహకార సంఘానికి 20.25, చెర్లబూత్కూర్ పీఏసీఎస్‌కు 20.256, నగునూర్‌కు 15.3, తీగలగుట్టపల్లి డీసీఎంఎస్‌కు 15.3 టన్నుల యూరియా వచ్చింది. కౌలు రైతులు యూరియా బస్తాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు రైతులు క్యూలో నిలబడి నిరాశతో వెనుదిరుగుతున్నారు. దీనిపై సంబందిత వ్యవసాయ అధికారులను వివరణ కోరగా రైతులకు సరిపడా ఎరువులను అందిస్తున్నామని తెలిపారు.
ఫ మానకొండూర్‌లో..
మానకొండూర్: కేడీసీఎంఎస్ మానకొండూర్ బ్రాంచ్‌కు శుక్రవారం యూరియా లోడు వచ్చింది. దీంతో సహకార సంఘ భవనం వద్దకు రైతులు చేరుకుని క్యూ కట్టారు. బ్రాంచ్ ఇన్‌చార్జి పట్టాదారు పుస్తకం, ఆధారు కార్డు జిరాక్స్ పత్రాలను రైతుల వద్ద తీసుకొని ఒక్కొక్క రైతుకు భూమి విస్తీర్ణం మేరకు యూరియా అందజేశారు.