Karimnagar: టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
ABN , Publish Date - Jan 09 , 2026 | 11:13 PM
హుజూరాబాద్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డీటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ పల్కల ఈశ్వర్‌రెడ్డి అన్నారు.
- నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన
హుజూరాబాద్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డీటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ పల్కల ఈశ్వర్‌రెడ్డి అన్నారు. హుజూరాబాద్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్న విరామ సమయంలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఈశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ . జాతీయ పెన్షన్ పథకం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాథమికోపాధ్యాయులకు ఓటు హక్కును కల్పించాలన్నారు. పాఠశాలల విలీనం, మూసివేతను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఆలిండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటానికి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం తిరుమల, వేల్పుల రత్నం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.