Share News

Karimnagar: పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలి: డీఎంహెచ్‌వో

ABN , Publish Date - Apr 06 , 2026 | 11:14 PM

సుభాష్‌నగర్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): వ్యక్తిగత పరిశ్రభ్రత పాటిస్తూ పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ అన్నారు.

Karimnagar:  పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలి: డీఎంహెచ్‌వో

సుభాష్‌నగర్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): వ్యక్తిగత పరిశ్రభ్రత పాటిస్తూ పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, ఈట్‌ రైట్‌ స్టే హెల్దీ అనే నినాదంతో ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి నుంచి కోర్టు చౌరస్తా వరకు సోమవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఫుడ్‌సేఫ్టీ పై శిక్షణ, సర్టిఫికెట్ల ప్రదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందన్నారు. పరిశుభ్రమైన, సమతుల్యమైన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.కార్యక్రమంలో అడిషినల్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుధా, ఎన్‌సీడీ పీవో డాక్టర్‌ విప్లవశ్రీ పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2026 | 11:15 PM