Karimnagar: ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టవద్దు
ABN , Publish Date - Apr 21 , 2026 | 12:27 AM
సుభాష్‌నగర్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టవద్దని, క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ చిత్రామిశ్రా అధికారులను ఆదేశించారు.
- కలెక్టర్ చిత్రామిశ్రా
సుభాష్‌నగర్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టవద్దని, క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ చిత్రామిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి దరఖాస్తులను స్వీరించారు. ప్రజావాణిలో 238 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే, కరీంనగర్, హుజూరాబాద్ ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్‌బాబు పాల్గొన్నారు.