Karimnagar: ఉత్సాహంగా జిల్లాస్థాయి ఎస్‌జీఎఫ్ క్రీడలు
ABN , Publish Date - Oct 05 , 2026 | 12:19 AM
కరీంనగర్ స్పోర్ట్స్, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి పాఠశాలల క్రీడలు ఆదివారం ఉత్సాహంగా సాగాయి.
కరీంనగర్ స్పోర్ట్స్, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి పాఠశాలల క్రీడలు ఆదివారం ఉత్సాహంగా సాగాయి. జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో కరాటే పోటీలను, ప్రాంతీయ క్రీడా పాఠశాలలో అథ్లెటిక్స్ పోటీలను, క్రీడా పాఠశాల స్విమ్మింగ్ పూల్‌లో స్విమ్మింగ్ పోటీలను నిర్వహించారు. ప్రాంతీయ క్రీడా పాఠశాలలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జంగం సుమన్ కళ్యాణ్, జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి వి శ్రీనివాస్‌గౌడ్ క్రీడాకారులను పరిచయం చేసుకొని ప్రారంభించారు. స్విమ్మింగ్ పోటీలను రామగుండం ఏసీపీ ప్రవీణ్ కుమార్, డీవైఎస్‌వో శ్రీనివాస్ గౌడ్, స్విమ్మింగ్ కోచ్ శ్రీకాంత్ ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో అండర్-14, 17 విభాగాల్లో బాలబాలికలకు కరాటే పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో దాదాపు 300 మంది క్రీడాకారులు పాల్గొని ప్రతిభచాటారు. జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి ఎల్ బన్సీలాల్ పోటీలను ప్రారంభించారు.