Karimnagar: ఉత్సాహంగా జిల్లాస్థాయి కిడ్స్‌డే వేడుకలు
ABN , Publish Date - Aug 01 , 2026 | 11:44 PM
కరీంనగర్ స్పోర్ట్స్, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జిల్లాస్థాయి కిడ్స్ డే వేడుకలు ఉత్సాహంగా సాగాయి.
కరీంనగర్ స్పోర్ట్స్, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జిల్లాస్థాయి కిడ్స్ డే వేడుకలు ఉత్సాహంగా సాగాయి. అలాగే నిర్వహించిన జిల్లాస్థాయి యూత్ అథ్లెటిక్స్ పోటీలకు విశేష స్పందన లభించింది. జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో సింథటిక్ ట్రాక్‌పై నిర్వహించిన వేడుకలను జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్ధన్‌రెడ్డి, సీనియర్ అథ్లెట్ మజాలు హాజరై జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. దాదాపు 350 మంది క్రీడాకారులకు జావెలిన్, అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారులను కరీంనగర్ ఉన్నత విద్యాశాఖ సూపరింటెండెంట్ బల్వీర్‌సింగ్ పతకాలను అందించారు. క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ పోటీల నిర్వహణను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు నందెల్లి మహిపాల్, ప్రధాన కార్యదర్శి సుమన్ కల్యాణ్‌లు పర్యవేక్షించగా సీనియర్ క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.