Karimnagar: జిల్లా క్రీడాకారులు జాతీయస్థాయికి ఎదగాలి
ABN , Publish Date - Sep 18 , 2026 | 12:34 AM
కరీంనగర్ స్పోర్ట్స్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లా క్రీడాకారులు జోనల్‌స్థాయి, రాష్ట్రస్థాయి పోటీల్లో విశేష ప్రతిభచాటి జాతీయస్థాయి క్రీడాకారులుగా ఎదగాలని జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి వి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
కరీంనగర్ స్పోర్ట్స్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లా క్రీడాకారులు జోనల్‌స్థాయి, రాష్ట్రస్థాయి పోటీల్లో విశేష ప్రతిభచాటి జాతీయస్థాయి క్రీడాకారులుగా ఎదగాలని జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి వి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి ఎస్‌జీఎఫ్ క్రీడల్లో భాగంగా గురువారం రెండవరోజు అండర్-14 బాలికల పోటీలను నిర్వహించారు. ఖో-ఖో, కబడ్డీ, వాలీబాల్ క్రీడాంశాల్లో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో జిల్లాలోని 16 మండలాల నుంచి 576 మంది బాలికలు హాజరై ఉత్సాహం గా పాల్గొన్నారు. అనంతరం నిర్వాహకులు అండర్-14 బాలికలకు క్రీడలు నిర్వహించి విశేష ప్రతిభ చాటిన క్రీడాకారులను జోనల్ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి గసిరెడ్డి జనార్ధన్ రెడ్డి , జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి బన్సీలాల్ తదితరులు హాజరయ్యారు.
ఫ అండర్-14 బాలికల పోటీల విజేతలు
అండర్-14 విభాగంలో జిల్లాస్థాయిలో నిర్వహించిన బాలికల పోటీల్లో కబడ్డీ విభాగంలో జమ్మికుంట మండలం ప్రథమ స్థానం సాధించగా, కరీంనగర్ అర్బన్ ద్వితీయ స్థానం సాధించింది. ఖో-ఖో విభాగంలో గంగాధర మండలం ప్రథమ స్థానం సాధించగా, తిమ్మాపూర్ మండలం ద్వితీయ స్థానం సాధించింది. అలాగే వాలీబాల్ విభాగంలో కొత్తపల్లి మండలం ప్రథమ స్థానం సాధించగా, శంకరపట్నం ద్వితీయ స్థానం సాధించింది.