Karimnagar: బస్ షెల్టర్లు లేక ఇబ్బందులు
ABN , Publish Date - Aug 17 , 2026 | 12:07 AM
చొప్పదండి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): చొప్పదండి పట్టణంలోని మార్కెట్ చౌరస్తాలో రాయపట్నం రహదారిపై బస్ షెల్టర్లు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
చొప్పదండి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): చొప్పదండి పట్టణంలోని మార్కెట్ చౌరస్తాలో రాయపట్నం రహదారిపై బస్ షెల్టర్లు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యా, వ్యాపార సంస్థలకు ముఖ్య కూడలిగా ఉన్న ఈ ప్రాంతం నుంచి ప్రతినిత్యం వందల మంది ప్రజలు బస్, ఆటోల ద్వారా ప్రయాణాలు కొనసాగిస్తుంటారు. ఈ చౌరస్తా నుంచి బస్ స్టేషన్ కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇక్కడి నుంచే ఎక్కువ మంది కరీంనగర్, ధర్మారం, గోపాల్‌రావుపేట, ఎలిగేడు, జూలపల్లి, పెద్దపల్లికి ప్రయాణాలు చేస్తుంటారు. ఇక్కడ రహదారికి ఇరువైపులా బస్‌షెల్టర్లు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ పాలకవర్గం ఇక్కడ షెల్టర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.