Share News

Karimnagar: అభివృద్ధి పనులు వేగవంతంగా చేపట్టాలి

ABN , Publish Date - Aug 01 , 2026 | 11:46 PM

కరీంనగర్‌ అర్బన్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వీవో బిల్డింగ్‌ల నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా

Karimnagar:  అభివృద్ధి పనులు వేగవంతంగా చేపట్టాలి

- వివో బిల్డింగ్‌ల నిర్మాణంపై ద్దృష్టి సారించాలి

- ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలి

- కలెక్టర్‌ చిత్రామిశ్రా

కరీంనగర్‌ అర్బన్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వీవో బిల్డింగ్‌ల నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఎంపీడీవోలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో వీవో బిల్డింగ్‌ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఫేజ్‌-1 పనులను సత్వరమే పూర్తి చేసి, ఫేజ్‌-2 అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులకే పథకం ప్రయోజనాలు అందేలా చూడాలన్నారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా ఎంపీడీవోలు మిషన్‌మోడ్‌లో పనిచేయాలని సూచించారు.

- ప్రత్యామ్నాయ పంటల సాగును విస్తరించాలి

కరీంనగర్‌ అర్బన్‌ : జిల్లాలో తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల విస్తరణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమా వేశంలో మాట్లాడారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులను ఒప్పించాలని అధికారులకు సూచించారు. ఆరుతడి పంటల విస్తీర్ణంపై మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఆయిల్‌పామ్‌ సాగు పెంచేలా రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్డీఓ గీత, డీపీఓ జగదీశ్వర్‌, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 01 , 2026 | 11:46 PM