Karimnagar: సీపీఐ వందేళ్ల ఉత్సవాలు
ABN , Publish Date - Jan 03 , 2026 | 11:19 PM
భగత్‌నగర్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): సీపీఐ వందేళ్ల ఉత్సవాల సందర్భంగా నగరంలో ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
- నేడు నగరంలో భారీ బహిరంగ సభ
- హాజరు కానున్న సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి
భగత్‌నగర్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): సీపీఐ వందేళ్ల ఉత్సవాల సందర్భంగా నగరంలో ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. భారత కమ్యునిస్టు పార్టీ సీపీఐ వందేళ్ల ఉత్సవాలు కరీంగర్‌లోని రెవెన్యూ గార్డెన్స్‌లో నిర్వహించేందుకు సీపీఐ అన్ని ఏర్పాట్లు చేసింది. సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ శాసనసభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తక్కల్లపల్లిశ్రీనివాస్‌రావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్ హాజరు కానున్నారు.
ఫ నగరంలో భారీ ర్యాలీ
భారత కమ్యునిస్టు పార్టీ వందేళ్ల ఉత్సవాల సందర్భంగా సీపీఐ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ర్యాలీలో రెడ్ షర్ట్ వలంటీర్లు, డప్పు చప్పుళ్లు కోలాట బృందాలు, కళాకారుల విప్లవ గేయాలతో ర్యాలీ నిర్వహించేందకు ఏర్పాట్లు చేశారు. నగరంలోని కమాన్ సర్కిల్, బస్టాండ్, గీతాభవన్ చౌరస్తా, కలెక్టరేట్ రోడ్డులో సీపీఐ జెండాలు, తోరణాలు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. రెవెన్యు గార్డెన్స్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభతో పాటు ఉత్సవాలకు సీపీఐ నాయకులు, కార్యకర్తలు, వామపక్ష అభ్యుద యవాదులు హాజరై విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పం జాల శ్రీనివాస్ కోరారు.