Karimnagar: రాములోరి హుండీ డబ్బులు లెక్కింపు
ABN , Publish Date - Apr 10 , 2026 | 11:59 PM
ఇల్లందకుంట, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి దేవాల యంలో శుక్రవారం హుండీలను లెక్కించగా రూ.20,39,551 సమకూరినట్లు ఈవో సుధాకర్ తెలిపారు.
- సమకూరిన ఆదాయం రూ.20,39,551
ఇల్లందకుంట, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి దేవాల యంలో శుక్రవారం హుండీలను లెక్కించగా రూ.20,39,551 సమకూరినట్లు ఈవో సుధాకర్ తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 17నుంచి ఏప్రిల్ 10వరకు 24రోజుల హుండీల ద్వారా ఆదాయం రూ.20,39,551 సమకూరినట్లు పేర్కొన్నారు. మిశ్రమ బంగారం 6 గ్రాములు, వెండి 225 గ్రాములు వచ్చినట్లు తెలిపారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ, ధర్మాదాయశాఖ డివిజన్ పరిశీలకులు పి సత్యనారాయణ, అర్చకులు శేషం వంశీధరాచార్యులు, మడికొండ నవీన్‌శర్మ, జూనియర్ అసిస్టెంట్ కావటి మోహన్, మల్లారెడ్డి, సురేందర్‌రావు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.