Share News

Karimnagar: భూసర్వేకు సహక రించాలి

ABN , Publish Date - Aug 23 , 2026 | 12:09 AM

కరీంనగర్‌ రూరల్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): భూభారతి రీసర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆర్డీవో షర్మిల గ్రామస్తులకు సూచించారు.

Karimnagar:  భూసర్వేకు  సహక రించాలి

కరీంనగర్‌ రూరల్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): భూభారతి రీసర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆర్డీవో షర్మిల గ్రామస్తులకు సూచించారు. కరీంనగర్‌ రూరల్‌ మండలం ఫకీర్‌పేటలో భూభారతిపై అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీవో షర్మిల హాజరై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామంలోని ప్రతీ స్థలం డిజిటలేషన్‌ ప్రకారం మ్యపింగ్‌ ద్వారా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బొద్దుల విజయలక్ష్మి, తహసీల్దార్‌ లక్ష్మీనరసింహరావు, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ కిషన్‌రావు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే రమణయ్య, ఇరిగేషన్‌ ఈఈ, ఎఈవో, సర్వేయర్‌ సంతోష్‌ కుమార్‌, ఆర్‌ఐ కనకరాజు, సర్వేయర్‌ సంతోష్‌, పంచాయతీ కార్యదర్శి జీపీఓ సాయికృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Aug 23 , 2026 | 12:09 AM