Karimnagar: పెట్రోల్ ధరలపై కాంగ్రెస్ నిరసన
ABN , Publish Date - May 25 , 2026 | 11:33 PM
గణేశ్‌నగర్, మే 25 (ఆంధ్రజ్యోతి): రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముత్యం శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం
గణేశ్‌నగర్, మే 25 (ఆంధ్రజ్యోతి): రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముత్యం శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ ఇందిరా చౌక్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు ఆటో రిక్షాకు తాడు కట్టి లాగుతూ నిరసన తెలిపారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ నెల రోజుల్లోనే నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యులకు మానసిక క్షోభకు గురిచేస్తోందన్నారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగి పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య, నాయకులు ఫహద్, పంజాల కృపాసాగర్, ఉప్పరి విశాల్, కార్పొరేటర్లు వరాల నరసింగం, పడాల శ్రీజ అజయ్, గుమ్మడి రాజకుమార్, పర్వతం మల్లేశం తదితరులు పాల్గొన్నారు.