Karimnagar: డబుల్ రోడ్డు పూర్తి చేయండి
ABN , Publish Date - Apr 02 , 2026 | 11:42 PM
గన్నేరువరం, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రానికి డబుల్ రోడ్డు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ గూడూరి సురేష్ అనే యువకుడు గన్నేరువరంలో నిర్వహించిన గ్రామసభకు కంకర తట్టతో వచ్చి నిరసన తెలిపాడు.
- గ్రామసభకు కంకర తట్టతో వచ్చి యువకుడి నిరసన
గన్నేరువరం, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రానికి డబుల్ రోడ్డు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ గూడూరి సురేష్ అనే యువకుడు గన్నేరువరంలో నిర్వహించిన గ్రామసభకు కంకర తట్టతో వచ్చి నిరసన తెలిపాడు. మండల కేంద్రానికి చెందిన వివేకానంద యూత్ అధ్యక్షుడు గూడూరి సురేష్ మండల ప్రధాన సమస్య అయిన డబుల్ రోడ్డును వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. గురువారం నిర్వహించిన గ్రామసభలో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తుండగా కంకర తట్టతో సభలోకి ప్రవేశించిన సురేష్ డబుల్ రోడ్డును వేస్తారా..కంకర రోడ్డుతో మా ప్రాణాలను తీస్తారా అంటూ నినాదాలు చేశాడు. మండల ప్రజల అందరి సమస్య డబుల్ రోడ్డు మాత్రమేనని, ఈ సమస్య సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు చేరేలా గ్రామసభల్లో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కంకర వేసి అసంపూర్తిగా వదిలేసిన డబుల్ రోడ్డుతో మండల ప్రజలు నరకయాతన పడుతున్నారని, ప్రజల ప్రాణాలతో చెలగాలటమాడద్దన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వెంటనే స్పందించి సీఎంతో మాట్లాడి డబుల్ రోడ్డుకు నిధులను విడుదల చేయించి పనులను పూర్తి చేయాలని కోరారు.