Share News

Karimnagar: కలెక్టర్‌గా చిత్రా మిశ్రా

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:20 AM

కరీంనగర్‌, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి, ప్రతినిధి): జిల్లా కలెక్టర్‌గా చిత్రా మిశ్రాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Karimnagar: కలెక్టర్‌గా చిత్రా మిశ్రా

కరీంనగర్‌, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి, ప్రతినిధి): జిల్లా కలెక్టర్‌గా చిత్రా మిశ్రాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఐటీడీఏ పీవోగా ఉన్న చిత్రా మిశ్రాను కలెక్టర్‌గా నియమించారు. 2019 బ్యాచ్‌ తెలంగాణ కేడర్‌కు చెందిన ఆమె 2020-21 నాగర్‌ కర్నూల్‌లో శిక్షణ పొందారు. జూన్‌ 2021-ఫిబ్రవరి 2024లో నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. సెప్టెంబనే 2021 నుంచి జులై 2023 వరకు నిజామాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా అదనపు బాధ్యలు నిర్వర్తించారు. ఫిబ్రవరి 2024 నుంచి ములుగు జిల్లా ఏటూరు నాగారం ఐటీడీఏ పీవోగా విధులు నిర్వహిస్తు జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు.

ప్రస్తుత కలెక్టర్‌ పమేలా సత్పతిని బదిలీ చేస్తు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్‌గా బదిలీ అయ్యారు.

Updated Date - Feb 27 , 2026 | 12:20 AM