Karimnagar: ‘బీర్’తో చిల్..
ABN , Publish Date - May 01 , 2026 | 12:22 AM
కరీంనగర్ క్రైం, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): ఎండలు మండిపోతున్నాయి. దీంతో మద్యం ప్రియులు బీరు వైపు మొగ్గు చూపుతున్నారు.
- రోజుకు రూ. రెండు కోట్లకు పైగా బీరు తాగేశారు
- 57 రోజుల్లో రూ.118 కోటఅమ్మకాలు
కరీంనగర్ క్రైం, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): ఎండలు మండిపోతున్నాయి. దీంతో మద్యం ప్రియులు బీరు వైపు మొగ్గు చూపుతున్నారు. బ్రాందీ, విస్కీలను సేవించే మందుబాబులు ప్రస్తుత వేసవి కాలంలో వాటికి స్వస్తి చెప్పి వేసవి తాపాన్ని తీర్చుకోవటానికి బీరు సేవిస్తున్నారు. విస్కీ, బ్రాంది, వోడ్కా, రమ్, జిన్ వంటి మద్యం సేవించే వారు ఎండతీవ్రతతో బీరు సేవిస్తుండడంతో అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. కరీంనగర్ మద్యం డిపో నుంచి కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్ల్లి జిల్లాలకు బీరు, మద్యం సరఫరా అవుతుంటుంది. కరీంనగర్ మద్యం డిపో పరిధిలోని మూడు జిల్లాలకు చెందిన 192 వైన్‌షాపులు, 58 బార్లకు మద్యం సరఫరా అవుతున్నది. కరీంనగర్ మద్యం (ఐఎంఎల్) డిపోలో మార్చి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 26వ తేదీ వరకు అమ్మకాలను పరిశీలిస్తే 2026 మార్చి నెలలో 3,30,270 పెట్టెల బీరు అమ్మకాలు సాగాయి. ఏప్రిల్‌లో 26 వరకు 2,51,895 పెట్టెల బీరు అమ్ముడుపోయింది. మొత్తం 57 రోజుల్లో 5,82,165 పెట్టెల బీరు అమ్మకాలు జరిగాయి. అమ్ముడయిన బీరు విలువ రూ. 118.56 కోట్లు. ఇది మద్యం డిపోలో రిటైల్‌షాపులు కొనుగోలు చేసిన విలువ మాత్రమే. ఈ విలువకు మరో 20 శాతం మార్జిన్‌తో వైన్ షాపులు, బార్లలో అమ్మకాలు జరుపుతారు.