Karimnagar: ప్రజల సహకారంతో జనగణన పూర్తి చేయాలి
ABN , Publish Date - May 25 , 2026 | 11:34 PM
తిమ్మాపూర్, మే25 (ఆంధ్రజ్యోతి): ప్రజలందరి సహకారంతో జనగణన పూర్తి చేయాలని జిల్లా అదనపు సెన్స్‌స్ ఆఫీసర్ కిషన్‌రావు పేర్కొన్నారు.
- జిల్లా అడిషనల్ సెన్సెస్ ఆఫీసర్ కిషన్‌రావు
తిమ్మాపూర్, మే25 (ఆంధ్రజ్యోతి): ప్రజలందరి సహకారంతో జనగణన పూర్తి చేయాలని జిల్లా అదనపు సెన్స్‌స్ ఆఫీసర్ కిషన్‌రావు పేర్కొన్నారు. తిమ్మాపూర్ మండల కేంద్రంతో పాటు జోగయ్యపల్లి గ్రామాలలో జరుగుతున్న 2027 జనగణన కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కిషన్‌రావు మాట్లాడుతూ ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు తమకు కేటాయించిన బ్లాకులలో ఇంటింటికి వెళ్లి 34 అంశములతో కూడిన వివరాలను మోబైల్ యాప్‌లో పొందుపరచాలని సూచించారు. ప్రతి ఇంటికి సంబంధించిన వివరాలను, కుటుంబ సభ్యులు తెలియజేసిన సమాచారాన్ని పొందుపరచాలని సూచించారు. సూపర్‌వైజర్లు కూడా ఎన్యు మరేటర్లు సమాచారం సేకరించే సమయంలో సరిగా నమోదు చేస్తున్నారని ఖచ్చితత్వపు సమా చారం మోబైల్ యాప్‌లో పొందుపరుస్తున్నారా అని ధ్రువీకరించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిఎస్‌ఓ కుమార స్వామి, ఫీల్డ్ ట్రెనర్స్ ముస్కు తిరుపతి రెడ్డి, మహేందర్ రెడ్డి, ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు.