Karimnagar: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలది కీలక పాత్ర
ABN , Publish Date - Jul 10 , 2026 | 12:00 AM
జమ్మికుంట రూరల్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలదే కీలక పాత్ర అని సీపీ గౌస్ ఆలం అన్నారు. జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల
జమ్మికుంట రూరల్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలదే కీలక పాత్ర అని సీపీ గౌస్ ఆలం అన్నారు. జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో క్రికెట్, వాలీబాల్ పోటీలను సీపీ గురువారం ప్రారంభించారు. అనంతరం మండలంలోని కోరపల్లి, సైదాబాద్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, కోరపల్లిలో ప్రీ-ప్రైమరీ పాఠశాలను ప్రారంభించారు. జమ్మికుంటలో విద్యార్ధులు, యువత, ఆటో డ్రైవర్లకు మత్తు పదార్ధాలు, సైబర్ క్రైమ్‌పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో సీపీ మాట్లాడారు. ప్రతి వీధిలో సీసీ కెమెరాలు ఉండటం వల్ల ప్రజల భద్రతకు భరోసా ఉంటుందన్నారు. జిల్లా వ్యాప్తాంగా 700 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. యువత మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలన్నారు. ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌లకు అలవాటు పడవద్దన్నారు. వాహనదారులు, ప్రయాణికులు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబందనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో హుజూరాబాద్ ఏసీపీ మాధవి, జమ్మికుంట సీఐ రామకృష్ణగౌడ్, రూరల్ సీఐ పులి వెంకట్, ఎస్సైలు ఆవుల తిరుపతి, స్వాతి, క్రాంతి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.