Karimnagar: అభ్యర్థులు ఎన్నికల నియమావళిని పాటించాలి
ABN , Publish Date - Feb 05 , 2026 | 12:07 AM
హుజూరాబాద్, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పనిసరిగా పాటించాలని ఎన్నికల సాధారణ పరిశీలకుడు జి జితేందర్‌రెడ్డి అన్నారు.
హుజూరాబాద్, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పనిసరిగా పాటించాలని ఎన్నికల సాధారణ పరిశీలకుడు జి జితేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎప్పటికప్పుడు ఎస్‌ఎస్‌టీ, వీఎస్‌టీ బృందాలు పరిశీలిస్తాయన్నారు. పోటీ చేసే అభ్యర్థులు 10 వేల రూపాయల కన్నా ఎక్కువగా ఉంచుకుని ప్రచారంలో పాల్గొనవద్దన్నారు. బ్యాంకు అంకౌంట్ ద్వారానే ఖర్చు చేయాలన్నారు. ఒక అభ్యర్థి వాల్ పోస్టర్‌పైన మరొక అభ్యర్థి వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు అంటించరాదన్నారు. సమావేశంలో వ్యయ పరిశీలకుడు మనోహర్, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, ఎక్సైజ్ ఎస్‌ఐ వినోద్‌కుమార్, టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ అశ్వినిగాంధీ, ట్రైనర్ తాళ్ల తిరుపతి పాల్గొన్నారు.