Share News

Karimnagar: నిర్మించారు... నిర్వహణ మరిచారు...

ABN , Publish Date - Oct 05 , 2026 | 12:20 AM

కరీంనగర్‌ టౌన్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): వందల కోట్ల రూపాయలను వెచ్చించి అత్యాధునిక హంగులతో స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో నిర్మించిన అభివృద్ధి పనులు పనికిరాకుండా పోతున్నాయి.

Karimnagar:  నిర్మించారు... నిర్వహణ మరిచారు...

- మసకబారుతున్న స్మార్ట్‌ వెలుగులు

- నిరుపయోగంగా ప్రజామరుగుదొడ్లు

- మూణ్ణాళ్ల ముచ్చటగా ఓపెన్‌జిమ్స్‌

- కోట్ల రూపాయల ప్రజాధనం వృథా

కరీంనగర్‌ టౌన్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): వందల కోట్ల రూపాయలను వెచ్చించి అత్యాధునిక హంగులతో స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో నిర్మించిన అభివృద్ధి పనులు పనికిరాకుండా పోతున్నాయి. స్మార్ట్‌సిటీ నిధుల గొప్పతనం మాదంటే మాదని చెప్పుకుంటున్న ప్రజాప్రతినిధులు, నిర్మించిన వాటి నిర్వహణపై దృష్టిపెట్టక పోవడంతో నిరుపయోగంగా మారుతున్నాయి. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెయ్యి కోట్ల నిధులను మంజూరు చేయగా 40కిపైగా ప్రాజెక్టులను చేపట్టేందుకు ఆ నిధులను వెచ్చించారు. పనులన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. ఒకటి రెండు జంక్షన్లు మినహా మిగితా జంక్షన్లలో వాటర్‌ ఫౌంటేన్లు పని చేయడం లేదు. లైట్లు వెలుగడం లేదు. పూలమొక్కలు, పచ్చికబయళ్లు ఎండిపోయాయి. లక్షలాది రూపాయలతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్ల ఆదరణ లేదు. ప్రజా మరుగుదొడ్లు చాలా చోట్ల నిర్వహణ లేక తాళాలు వేశారు. కలెక్టరేట్‌ నుంచి మొదలుకొని అనేక చోట్ల ఏర్పాటు చేసిన స్మార్ట్‌ లైట్లు వెలుగడం లేదు. పార్కుల నిర్వహణ బాధ్యతలను ఒక్కొక్కటిగా ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించడంతో అవి షాపింగ్‌ మాల్స్‌, సమావేశాలు, సభలకు వేదికలుగా మారాయిజ ప్రజలకు దూరంగా ఏర్పాటు చేసిన ఓపెన్‌ జిమ్స్‌ శిథిలావస్థకు చేరుకున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు స్మార్ట్‌సిటీ కింద ఏర్పాటు చేసిన ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని నగరవాసులు కోరుతున్నారు.

Updated Date - Oct 05 , 2026 | 12:20 AM