Share News

Karimnagar: చింతకుంట చిన్నారులు పుస్తకావిష్కరణ

ABN , Publish Date - Aug 23 , 2026 | 12:01 AM

భగత్‌నగర్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు రాసిన చింతకుంట చిన్నారులు పుస్తకాన్ని

Karimnagar:  చింతకుంట చిన్నారులు పుస్తకావిష్కరణ

భగత్‌నగర్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు రాసిన చింతకుంట చిన్నారులు పుస్తకాన్ని జిల్లా సెక్టోరియల్‌ అధికారి అశోక్‌రెడ్డి శనివారం అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ప్రణాళిక బద్ధంగా చదవాలన్నారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతకు పదును పెట్టడానికి కథారచన ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పాఠశాలకు చెందిన 38 మంది విద్యార్థులు రాసిన కథలను తెలుగు ఉపాధ్యాయురాలు చిందం అన్నపూర్ణ పుస్తక రూపంలో తీసుకు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ లక్ష్మి, జోనల్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఎంఈవో ఆనందం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 23 , 2026 | 12:01 AM