Karimnagar: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీదే విజయం
ABN , Publish Date - Feb 01 , 2026 | 12:04 AM
భగత్‌నగర్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీల్లో బీజేపీనే విజయం సాధిస్తుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు.
- కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్
భగత్‌నగర్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీల్లో బీజేపీనే విజయం సాధిస్తుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. శనివారం నగరంలో కార్పొరేషన్ డివిజన్ ఇన్‌చార్జిలు, కన్వీనర్లు, కో-కన్వీనర్లు సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో విజయం సాధిస్తామని సర్వేల్లో వెల్లడైందన్నారు. అత్యధిక స్థానాలు సాధించే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీని నమ్ముకుని కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకే టికెట్ల విషయంలో ప్రాధాన్యం ఉంటుందన్నారు. 80 శాతానికిపైగా టికెట్లు వారికే ఇవ్వాలని నిర్ణయించామన్నారు. టికెట్లు రాని బీజేపీ కార్యకర్తలు బాధపడాల్సిన అవసరం లేదని నామినేటెడ్ పదవులు ఇచ్చి న్యాయం చేస్తామన్నారు. టికెట్లు రాని వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామన్నారు. కరీంనగర్ కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగురవేసే బాధ్యత కార్యకర్తలదే అన్నారు. టికెట్ ఆశించి భంగపడిన కార్యకర్తలను సముదాయించి బీజేపీ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేసేలా చూడాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు గీతామూర్తి, నాయకులు సాయిని మల్లేశం, గుజ్జ శ్రీనివాస్, ఇనుగొండ నాగేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.