Karimnagar : బీజేపీలో గెలుపు ధీమా... చివరి ప్రయత్నాల్లో కాంగ్రెస్
ABN , Publish Date - Feb 15 , 2026 | 01:19 AM
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్) మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కైవసం చేసుకొని కరీంనగర్ కార్పొరేషన్‌లో అధికారం చేపడుతామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్న ది.
- బీజేపీ తెరపైన వాసాల, కొలగాని, బండారి
- డిప్యూటీగా సునీల్‌రావు, ప్రవీణ్‌రావు, వంగల పవన్
- కాంగ్రెస్‌ను మేయర్ పదవి డిమాండ్ చేసిన బీఆర్‌ఎస్
- అంగీకరిస్తే మద్దతు ఇచ్చే అవకాశం
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కైవసం చేసుకొని కరీంనగర్ కార్పొరేషన్‌లో అధికారం చేపడుతామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్న ది. కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లలో 30 డివిజన్లలో విజయం సాధించి అత్యధిక స్థానాలను సాధించిన పార్టీగా బీజేపీ నిలిచింది. ఈ పార్టీకి కార్పొరేషన్‌లో అధికారం చేపట్టడానికి 35 మంది సభ్యుల ఓట్లు అవసరం కాగా ఇప్పటికే ఆ మేరకు సంఖ్యాబలాన్ని పొందింది. తాము గెలుచుకున్న 30 మంది కార్పొరేటర్లకు తోడు ఒక ఫార్వర్డ్‌బ్లాక్ సభ్యు రాలు సాయిజ్యోతి, ఇండిపెండెంట్లుగా పోటీచేసి గెలిచిన వేముల కవిత, మాసం గణేశ్, తేళ్ల లక్ష్మి బీజేపీలో చేరారు. ఈ నలుగురి చేరికతో కార్పొరేషన్‌లో పార్టీ కార్పొరేటర్ల సంఖ్య 34కు చేరుకోగా, ఎక్స్ ఆఫిషియో సభ్యుడిగా ఉన్న కేంద్రమంత్రి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఓటుతో కలుపుకొని మ్యాజిక్ ఫిగర్ 35 సాధించినట్లయింది. దీనితో బీజేపీ కార్పొరేషన్‌లో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను ఈనెల 16న జరిగే ఎన్నికలో దక్కించుకోవడం ఖాయంగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. హైదరాబాద్‌లో క్యాంపు వేసిన బీజేపీ నేతలు మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకోవడం ఖాయమని తేలిపోవడంతో ఆ పదవుల్లో ఎవరిని నిలపాలో అన్న విషయంపై దృష్టిసారించారు. అభ్యర్థుల ఎంపిక నుంచి వారు గెలిచే వరకు తీసుకున్న అన్ని నిర్ణయాల్లో ప్రచారాల్లో అన్నీ తానే అయి వ్యవహ రించి గెలుపును సాధ్యం చేసిన బండి సంజయ్‌కుమార్‌పైనే మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల ఎంపిక భారాన్ని పార్టీవేసింది. ఆయన ఎంపిక చేసిన అభ్యర్థులను ఆయా పదవులకు ఏకగ్రీవంగా ఎన్నుకో వడం లాంఛనప్రాయమే. మేయర్ పదవి బీసీ జనరల్‌కు రిజర్వు కావడంతో డిప్యూటీ మేయర్ పదవి ఓసీకి అప్పగిస్తారని భావిస్తు న్నారు. మేయర్ పదవికి కొత్తపల్లి నుంచి ఎన్నికైన వాసాల రమేశ్, తీగలగుట్టపల్లి నుంచి ఎన్నికైన కొలగాని శ్రీనివాస్, బండారి వేణు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. డిప్యూటీ మేయర్ పదవికి మాజీ మేయర్ సునీల్‌రావుతో పాటు బోయినపల్లి ప్రవీణ్‌రావు, వంగల పవన్‌కుమార్ పేర్లు తెరపైకి వచ్చినట్లు చెబుతున్నారు. గతంలో మండల పరిషత్ అధ్యక్షుడిగా, మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేసి రాజకీయ అనుభవం ఉన్న వాసాల రమేశ్ మేయర్‌గా, సునీల్‌రావు డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతున్నది.
ఫ మేయర్ పీఠం కోసం కాంగ్రెస్ ప్రయత్నం
కార్పొరేషన్‌లోని 66 డివిజన్లలో 30 డివిజన్లు బీజేపీ గెలుచుకోగా, కాంగ్రెస్ 14 స్థానాలను చేజిక్కించుకున్నది. బీఆర్‌ఎస్ 9స్థానాల్లో, ఫార్వర్డ్‌బ్లాక్ 2 స్థానాల్లో, ఎంఐఎం 3 స్థానాల్లో, ఇండిపెండెంట్లు 8 స్థానాల్లో గెలుపొందారు. కార్పొరేషన్ పరిధిలో బండి సంజయ్‌కుమార్ ఎంపీ హోదాలో, గంగుల కమలాకర్, కవ్వంపల్లి సత్యనారాయణ కరీం నగర్ పట్టణ పరిధిలో ఓటర్లుగా ఉన్న ఎమ్మెల్యేలుగా ఎక్స్ ఆఫీషియో ఓటు హక్కు పొందారు. 66 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్ ఆఫీషియో సభ్యులతో కలుపుకొని 69 మంది కాగా, మెజార్టీ కోసం 35 స్థానాలు ఏదైనా ఒక పార్టీకి కావలసి ఉంటుంది. 31 ఓట్లు కలిగి ఉన్న బీజేపీ తమకు ముగ్గురు ఇండిపెండెంట్లు, ఒక పార్వర్డ్‌బ్లాక్ సభ్యుడు తమ పార్టీలో చేరడంతో తమ బలం 35కు చేరుకున్నదని, విజయం తమదేనని చెబుతున్నది. అయితే 14 మంది కార్పొరేటర్లను కలిగి ఉన్న కాంగ్రెస్, ముగ్గురు ఎంఐఎం, ఒకరు ఫార్వర్డ్‌బ్లాక్, ఐదుగురు ఇండిపెం డెంట్లు, ఒక ఎక్స్ ఆఫీషియో సభ్యుల ఓట్లు తమకున్నాయని, బీఆర్‌ఎస్ మద్దతు ఇస్తే వారి తొమ్మిది కార్పొరేటర్లు, ఒక ఎక్స్‌ఆఫిషియో సభ్యు డితో కలుపుకొని 34 మంది అవుతామనని చెపుతున్నారు. ఫార్వర్డ్‌బ్లాక్ తమ మిత్రపక్షంగా విప్ జారీ చేస్తుందని, దాంతో బీజేపీ వద్ద ఉన్న ఫార్వర్డ్‌బ్లాక్ సభ్యురాలు కూడా తమకే ఓటు వేస్తుందని దీనితో 35 ఓట్లు పొంది మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను దక్కించు కుంటామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే బీఆర్‌ఎస్ మాత్రం ఈ విషయంలో అధికారికంగా ఏ ప్రకటన చేయలేదు. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే ఎక్స్ ఆఫిషియో సభ్యుడైన గంగుల కమలాకర్ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ ‘‘బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన 9 మంది కార్పొరేటర్లుగా గెలు పొందారు. మా పార్టీకి చెందిన మరొకరు ఇండిపెండెంట్‌గా పోటీచేసి గెలుపొందారు. మా వారిని క్యాంపునకు తరలించాం. బీజేపీ నేతలె వరూ మమ్మల్ని మద్దతు కోసం సంప్రదించలేదు. కాంగ్రెస్ నేతలు మా మద్దతు కోరారు. అయితే వారిని మేయర్ పదవి అడిగాం. వారి నుంచి ఎలాంటి సమాధానం లేదు. కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధిని కాంక్షించే వారిగా మా పార్టీ నిర్ణయం ఉంటుంది. మేయర్ పదవి లభిస్తే అభివృద్ధి చేయడానికి అవకాముంటుంది. వారి నిర్ణయం మేరకు మా నిర్ణయం ఉంటుంది. మేము ప్రతిపక్షంలో ఉండి అభివృద్ధి కోసం, ప్రజల సేవ కోసం పాటుపడటానికి అయినా సిద్ధంగా ఉన్నాం’’ అన్నారు. ఫార్వర్డ్‌బ్లాక్ విప్ జారీచేసినా పదవిని వదలుకోవడానికి ఆ పార్టీకి చెందిన సభ్యురాలు సిద్ధపడితే గెలుపు బీజేపీనే వరిస్తుంది. లేనిపక్షంలోనే కాంగ్రెస్ ఆశలు ఫలించే అవకాశం కలుగుతుంది. మూ డు పార్టీల క్యాంపులు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఈ నెల 16న ఓటు వేసే సమయానికి వారు కరీంనగర్ చేరుకుంటారని చెబుతున్నారు. బీజేపీకి 31 ఓట్లు ఉండడంతోపాటు ఇప్పటికే నలుగురు ఆ పార్టీలో చేరడంతో విజయావకాశాలు వారికే ఉన్నాయి. ఆయా డివిజన్లకు చెందిన ముఖ్యులు మిగతా ఇండిపెండెంట్లతో ఫోన్‌లో మాట్లాడుతూ బీజేపీలో చేరే విషయమై సానుకూలంగా ఆలోచించాలని కోరుతున్నట్లు సమాచారం. ఎన్నికల తర్వాత మరికొందరు కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లను వీడి బీజేపీలో చేరుతారని, 40 మంది బల గంగా బీజేపీ కరీంనగర్ కార్పొరేషన్‌లో ఎదగడం ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.