Karimnagar: నేడు కరీంనగర్‌కు బీజేపీ చీఫ్ నితిన్ నబీన్
ABN , Publish Date - Nov 22 , 2026 | 11:56 PM
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్) భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సోమవారం కరీంనగర్ రానున్నారు.
- కాషాయమయమైన కరీంనగర్
- మహాపాదయాత్రకు ఏర్పాట్లు పూర్తి
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సోమవారం కరీంనగర్ రానున్నారు. కరీంనగర్‌లో మహా పాదయాత్ర చేపట్టేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో పాటు, రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు, రాష్ట్ర ఇన్‌ఛార్జి సునీల్‌బన్సల్‌తో పాటు సహా ఇన్‌చార్జిలు అభయ్‌పాటిల్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాశర్మ తదితరులు హాజరు కానున్నారు.
- మహాపాదయాత్ర ఇలా..
భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌నబీన్ మద్యాహ్నం 12.30కు కరీంనగర్ రానున్నారు. నగరంలో నిర్వహించనున్న మహాపాదయాత్రలో పాల్గొని ప్రసంగిస్తారు. ముందుగా కరీంనగర్ కలెక్టరేట్ హెలీపాడ్ నుంచి నగరంలోని గాంధి విగ్రహం వద్దకు చేరుకుంటారు. వైశ్యాభవన్ వద్ద ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. వైశ్యభవన్, రాజీవ్ చౌక్, టవర్ సర్కిల్, శాస్త్రీరోడ్, భారత్‌టాకీస్‌మీదుగా కమాన్ చౌరస్తా వరకు ప్రజలతో కలిసి మహాపాదయాత్రలో పాల్గొంటారు. సాయంత్రం 4.30కు హెలీప్యాడ్ వద్దకు చేరుకుని హైదరాబాద్‌కు బయలు దేరుతారు.
- భారీగా ఏర్పాట్లు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నితిన్ నబీన్ తొలిసారి కరీంనగర్ రానుండడంతో లక్ష మందితో మహాపాదయాత్ర నిర్వహించేందుకు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ అన్ని ఏర్పాట్లు చేశారు. నితిన్ నబీన్‌కు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. ఆకుల నాగేశ్వర్‌రావు ఆధ్వర్యంలో కళా బృందం ప్రత్యేకంగా ఆటపాటలతో అలరించేందుకు ఏర్పాట్లు చేశారు. కరీంనగర్‌లోని కూడళ్లని కాషాయ జెండాలతో అలంకరించారు. వెయ్యికిపైగా బస్సులు, 500 మినీ బస్సులు, వ్యాన్లు, రెండు వేల ఆటోలను సిద్ధం చేసినట్లు బీజేపీ శ్రేణులు వెల్లడించారు. కరీంనగర్‌లో నిర్వహించతలపెట్టిన మహా పాదయాత్ర చరిత్ర సృష్టించనున్నదని కేంద్ర హోం శాఖసహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ వెల్లడించారు.