Karimnagar : ఆరు ఎకరాల వరకు ‘భరోసా’
ABN , Publish Date - Jul 06 , 2026 | 12:56 AM
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్) ప్రభుత్వం ప్రకటించిన విధంగానే ఐదు రోజులుగా రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమచేస్తున్నది. జూన్ 30న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
- 1,87,354 మంది రైతుల ఖాతాల్లో రూ.179.73 కోట్లు
- వానకాలం సాగుకు అందిన పెట్టుబడి సాయం
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
ప్రభుత్వం ప్రకటించిన విధంగానే ఐదు రోజులుగా రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమచేస్తున్నది. జూన్ 30న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ సీజన్‌లో రైతులకు సహాయాన్ని అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలిరోజు రెండెకరాల వరకు భూమి ఉన్న రైతులకు నిధులు జమచేయడం ప్రారంభించారు. ఆ తర్వాత వరుసగా సెలవు రోజుల్లో మినహా ఒక్కొక్క ఎకరం పెంచుతూ ప్రస్తుతం ఆరు ఎకరాల భూమి ఉన్న వారికి రైతు భరోసా సాయం వారి ఖాతాల్లో జమచేశారు. జిల్లాకు చెందిన 1,87,354 మంది రైతులకు 179 కోట్ల 73 లక్షల 46,877 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేశారు. ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఈ సాయాన్ని అందిస్తున్నారు.
ఫ జిల్లాలో 2,15,433 మంది రైతులు
జిల్లాలో 2,15,433 మంది రైతులు ఉండగా వీరికి ఉన్న భూమికి గాను ఎకరానికి ఆరువేల చొప్పున 213.75 కోట్ల రూపాయలు అవసరమవుతాయని భావించారు. వారు సమర్పించిన పట్టాదారు పాసుపుస్తకాలు, బ్యాంకు అకౌంట్ అనుసంధానం వివరాల మేరకు 2 లక్షల 90 మంది రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో వ్యవసాయ విస్తరణ అధికారులు అప్‌డేట్ చేశారు. వీరిలో 1,92,922 మందికి 207.11 కోట్ల రూపాయలు ట్రెజరీకి పంపించారు.
- ఇప్పటి వరకు జిల్లాలోని చొప్పదండి మండలానికి చెందిన 13,030 మంది రైతులకు 12.67 కోట్లు, గంగాధరకు చెందిన 14,192 మందికి 14.24 కోట్లు, రామడుగుకు చెందిన 13,595 మందికి 12.53 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి.
- చిగురుమామిడికి చెందిన 12,583 మందికి 13.97 కోట్లు, సైదాపూర్‌కు చెందిన 13,771 మందికి 14.28 కోట్లు, ఇల్లందకుంటకు చెందిన 10,565 మందికి 10.19 కోట్లు, హుజూరాబాద్‌కు చెందిన 13,564 మందికి 12.29 కోట్లు అందించారు.
- జమ్మికుంటకు చెందిన 12,320 మందికి 11.68 కోట్లు, వీణవంకకు చెందిన 14,321 మందికి 14.15 కోట్ల సహాయం అందింది.
- కరీంనగర్ అర్బన్ మండలానికి చెందిన 11 మంది రైతులకు 1,16,173, కరీంనగర్ రూరల్ మండలానికి చెందిన 10,920 మందికి 8.42 కోట్లు, కొత్తపల్లి మండలానికి చెందిన 7,139 మందికి 5.31 కోట్లు అందించారు.
గన్నేరువరం మండలానికి చెందిన 6,771 మందికి 7.84 కోట్లు, మానకొండూర్‌కు చెందిన 19,759 మందికి 18.64 కోట్లు, శంకరపట్నం మండలానికి చెందిన 13,362 మందికి 12.73 కోట్లు, తిమ్మాపూర్ మండలానికి చెందిన 11,451 మంది రైతులకు 10.70 కోట్ల రైతుభరోసా సాయం అందింది. మిగతా రైతులకు వచ్చే మూడు రోజుల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తారు.