Share News

Karimnagar: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగస్వాములు కావాలి

ABN , Publish Date - Jun 13 , 2026 | 12:00 AM

కరీంనగర్‌ క్రైం, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా పిలుపునిచ్చారు.

Karimnagar:  బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగస్వాములు కావాలి

- కలెక్టర్‌ చిత్రా మిశ్రా

కరీంనగర్‌ క్రైం, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా పిలుపునిచ్చారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం కలెక్టరేట్‌లో కార్మిక శాఖ రూపొందించిన పోస్టర్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బాలబాలికలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్‌ కోలా ప్రసాద్‌, కార్మిక శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ వెంకటరమణ పాల్గొన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, పోలీసు శాఖ, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సమన్వయంతో కరీంనగర్‌లో ర్యాలీ నిర్వహించారు. జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా కార్మిక శాఖ అధికారి ప్రసాద్‌, బాలల సంక్షేమ సమితి సభ్యులు రేండ్ల కళింగ శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 13 , 2026 | 12:00 AM