Karimnagar: పునరుత్పత్తి సమస్యలపై అవగాహన పెంచుకోవాలి
ABN , Publish Date - Mar 06 , 2026 | 12:32 AM
తిమ్మాపూర్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): పాడి పశువుల పురురుత్పత్తి సమస్యలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా పశువైద్య, పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఎస్ లింగారెడ్డి సూచించారు.
తిమ్మాపూర్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): పాడి పశువుల పురురుత్పత్తి సమస్యలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా పశువైద్య, పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఎస్ లింగారెడ్డి సూచించారు. రాష్ట్రంలో నూతనంగా నియమితులైన పశువైద్యాధికారులకు, కరీంనగర్ ప్రాంతీయ పశు సంవర్థక శిక్షణా కేంద్రంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా మండలంలోని పోలంపల్లి, మహాత్మానగర్ గ్రామాల్లో పాడి పశువుల ఉచిత గర్భకోశ వ్యాధుల నివారణా శిబిరాలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పశువైద్య, పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఎస్ లింగారెడ్డి మాట్లాడుతూ పాడి రైతుల లాభనష్టాలను ప్రభావితం చేసే అంశాల్లో పునరుత్పత్తి సమస్యలు అత్యంత కీలకమన్నారు. పశు వైద్యాధికారులకు శిక్షణలో భాగంగా పాడి పశువులు ఎక్కువగా ఉండే గ్రామాల్లో ఉచిత గర్భకోశ నివారణ శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ శిబిరాల్లో 81 పాడి పశువులకు పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా పశుగాణాభివృఽధ్ది సంస్థ ముఖ్య అధికారి శ్రీదేవి, మహాత్మానగర్, పొలంపల్లి గ్రామ సర్పంచ్‌లు పొన్నాల సంపత్, గుంటి లావణ్య, బోధనా పశు వైద్యా నిపుణులు డాక్టర్ రాజిరెడ్డి, అంబి రాజేష్, హన్నన్, శిక్షణ కేంద్రం అధ్యాపకుడు సాయి చైతన్య, దివ్య, మండల పశువైద్యాధికారులు సురేందర్‌రెడ్డి, భారతి, మౌనిక పాల్గొన్నారు.