Share News

Karimnagar: పిల్లల దత్తతపై అవగాహన కల్పించాలి

ABN , Publish Date - Apr 27 , 2026 | 11:30 PM

కరీంనగర్‌ క్రైం, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): శిశువులు, చిన్నారుల దత్తత విషయంలో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అన్నారు.

Karimnagar:  పిల్లల దత్తతపై అవగాహన కల్పించాలి

కరీంనగర్‌ క్రైం, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): శిశువులు, చిన్నారుల దత్తత విషయంలో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో ‘పిల్లల భద్రత, రక్షణ’- సే నో టు డ్రగ్‌ు అనే అంశంపై నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా దత్తత అవగాహన హెల్ప్‌డెస్క్‌ను కలెక్టరేట్‌లో కలెక్టర్‌ చిత్రా మిశ్రా సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ...దత్తతకు సంబంధించిన వివరాల కోసం ప్రజలు 1098 (చైల్డ్‌లైన్‌), 9490881098 నంబర్లను సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ అశ్విని తానాజీ వాఖడే, ిసీబ్ల్యూసీ చైర్‌ పర్సన్‌ ధనలక్ష్మి, జిల్లా బాలల సంరక్షణ అధికారి పర్వీన్‌, డీఎంహెచ్‌వో వెంకటరమణ, డీపీవో జగదీశ్వర్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2026 | 11:30 PM