Share News

Karimnagar: వడదెబ్బపై అవగాహన కల్పించాలి

ABN , Publish Date - May 01 , 2026 | 12:13 AM

సుభాష్‌నగర్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతున్నందున వడదెబ్బ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ వైద్యులు, సిబ్బందికి సూచించారు.

Karimnagar:   వడదెబ్బపై అవగాహన కల్పించాలి

సుభాష్‌నగర్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతున్నందున వడదెబ్బ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ వైద్యులు, సిబ్బందికి సూచించారు. నగరంలోని సప్తగిరి అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌, పద్మనగర్‌ బస్తీ దవాఖానాను ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేషంట్‌కు సరైన సమయంలో చికిత్స అందించాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందన్నారు. ఆయనతోపాటు ఎంహెచ్‌ఎన్‌ పీవో డాక్టర్‌ సన జవేరియా, పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ సఫీర్‌ పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2026 | 12:13 AM